భారతీయ రైల్వే... ఎక్స్‌ప్రెస్, మెయిల్ రైళ్లను మరిన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. తాజాగా వెయిటింగ్ లిస్ట్‌కు సంబంధించిన మార్గదర్శకాలనూ జారీ చేసింది. ప్రస్తుతం నడుస్తున్న రైలు సేవలతో సహా త్వరలో పునః ప్రారంభించే మార్గాల్లో మే 22 నుంచి వెయిటింగ్ లిస్ట్ అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొంది.
అయితే వెయిటింగ్ జాబితాలో కొద్ది మందికే చోటు దక్కనుంది. ఏసీ 3 టైర్లో 100, ఏసీ 2 టైర్లో 50, స్లీపర్ క్లాస్‌లో 200, ఛైర్ కార్లో 100, ఫస్ట్, ఎక్జిక్యూటివ్ తరగతులలో వెయిటింగ్ లిస్ట్ సంఖ్యను 20కి పరిమితం చేసింది.