లాక్డౌన్ కారణంగా నిలిచిపోయిన ప్రయాణికుల రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. దశల వారిగా రైళ్ల పునరుద్ధరణ జరపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు మే 12 నుంచి 15 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది.
దిల్లీ రైల్వే స్టేషన్ నుంచి దిబ్రుగఢ్, అగర్తలా, హౌారా, పట్నా, బిలాస్‌పుర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్గావ్, ముంబయి సెంట్రల్, అహ్మదాబాద్, జమ్ము తావిలకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
మే 11 సాయంత్రం 4 గంటల నుంచి ఈ రైళ్ల కోసం ఆన్లైన్ రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి. టికెట్లను ఐఆర్సీటీసీ వెబ్సైట్(https://www.irctc.co.in/) ద్వారా బుక్ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లలోని టికెట్ కౌంటర్లు మాత్రం మూసే ఉంటాయి.