లక్షలాది మంది ఒప్పంద ఉద్యోగులకు ఉపశమనం కలిగించేలా భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా మార్చి 31 వరకు రైలు సేవలన్నీ నిలిపివేసినప్పటికీ, కాంట్రాక్ట్ ఉద్యోగుల పూర్తి జీతం విడుదల చేయాలని నిర్ణయించింది.
"కరోనాను నియంత్రించేందుకు ప్రస్తుతం రైల్వే సేవలను నిలిపివేశాం. ఫలితంగా ఆన్-బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్, పారిశుద్ధ్యం, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనేక మంది కాంట్రాక్ట్ సిబ్బంది విధుల నుంచి దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఒప్పంద ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలి. మిగిలిన వారు సమాచారం అందించిన వెంటనే విధులకు హాజరుకావడానికి సిద్ధంగా ఉండాలి."