తెలంగాణ

telangana

ETV Bharat / bharat

2021 కల్లా 7వేల రైల్​ కోచ్​ల్లో నిఘానేత్రాలు! - పీయూష్​ గోయెల్

వచ్చే రెండేళ్లలో 7 వేల రైల్​ కోచ్​ల్లో సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా పని చేస్తున్నామని రైల్వే మంత్రి పీయూష్​ గోయెల్​ స్పష్టం చేశారు. లోక్​సభలో అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు గోయెల్.

పీయూష్​ గోయెల్​

By

Published : Jul 3, 2019, 8:08 PM IST

2021 మార్చి కల్లా 7వేల ప్రయాణికుల​ రైల్​ కోచ్​ల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని రైల్వే మంత్రి పీయూష్​ గోయెల్​ తెలిపారు. లోక్​సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విషయాన్ని ప్రకటించారు మంత్రి.

"ప్రీమియం, మెయిల్​, ఎక్స్​ప్రెస్​, సబర్బన్​ రైళ్లలో ఇప్పటికే సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ప్రధాన పాసెంజర్​ రైళ్లలోని 1,300 కోచ్​ల్లోనూ అమర్చాం. ప్రస్తుతం మొదటి దశలో భాగంగా 2021 మార్చ్​ కల్లా 7,020 కోచ్​ల్లో సీసీ టీవీలను ఏర్పాటు చేస్తాం. మిగతా కోచ్​లను ఆ తర్వాత దశలో పూర్తి చేస్తాం."

-పీయూష్​ గోయెల్​, రైల్వే మంత్రి

ఇదీ చూడండి: కిరణ్​ బేడీ ట్వీట్​పై లోక్​సభలో గందరగోళం

ABOUT THE AUTHOR

...view details