వినాయక చవితి వేడుకల నేపథ్యంలో కొంకణ్ ప్రాంతానికి ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ ప్రకటించే అవకాశం ఉంది. ఈ విషయమై మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించినట్లు రైల్వే అధికారి ఒకరు చెప్పారు.
"రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య రైల్వే లేఖ రాసింది. కొంకణ్ ప్రాంతంలో ప్రత్యేక రైళ్లను నడిపే విషయంలో అభిప్రాయాలను కోరింది. మధ్య, పశ్చిమ, కొంకణ్ రైల్వే సహకారంతో ఈ రైళ్లను నడిపే అవకాశం ఉంది."
- రైల్వే అధికారి
ఆగస్టు 22న ప్రారంభమయ్యే గణేశ్ చతుర్థి వేడుకలు 10 రోజులపాటు జరగనున్నాయి. అన్ని రోజులు ప్రత్యేక రైళ్లను నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైళ్ల సంఖ్య, ఫ్రీక్వెన్సీని మాత్రం డిమాండ్‌ను బట్టి నిర్ణయిస్తారని సదరు అధికారి వెల్లడించారు.
రైళ్లను నడపాల్సి వస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన కొవిడ్- 19 మార్గదర్శకాలను పాటించాలని మహారాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం డైరెక్టర్ అభయ్ యావల్కర్ స్పష్టం చేశారు. రైళ్లు, స్టేషన్లలో భౌతిక దూరం, మాస్కులను తప్పనిసరి చేయాలని చెప్పారు.
ఇదీ చూడండి:కేరళ విమాన ప్రమాద దృశ్యాలు