గతేడాది లాక్డౌన్ కారణంగా రద్దు అయిన రైళ్ల టికెట్లపై రిఫండ్‌ను పొందే గడువు కేంద్ర రైల్వే శాఖ పొడిగించింది. ప్రస్తుతం ప్రయాణ తేదీ నుంచి ఆరు నెలల వరకు ఉన్న గడువును 9 నెలలకు పెంచుతున్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేసింది.
"2020 మార్చి 21 నుంచి జూన్ 7 మధ్య రద్దు అయిన రైళ్ల టికెట్లపై రిఫండ్ పొందే గడువును 9 నెలలకు పొడిగిస్తున్నాము. రోజువారిగా నడిచే రైళ్లకే ఈ రిఫండ్ వర్తిస్తుంది.
ఈ ఆరు నెలల గడువులో ఎంతో మంది రిఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అందరికీ పూర్తి స్థాయిలో రిఫండ్ అందుతుంది."