విమానాశ్రయాల్లో వినియోగ ఛార్జీల తరహాలో త్వరలో రైల్వే ప్రయాణికుల నుంచి కూడా వసూలు చేయనున్నారు. దేశంలో ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లలో అత్యాధునిక సదుపాయాలను రైల్వే శాఖ ఏర్పాటు చేస్తోంది. వీటిని వాడుకునే ప్రయాణికుల నుంచి నామమాత్రంగా ఛార్జీలు వసూలు చేయనున్నారు.
రైల్వే ప్రయాణికులకూ యూజర్ ఛార్జీలు! - రైల్వే శాఖ వార్తలు
విమానాశ్రయాల తరహాలో రైల్వే స్టేషన్లలోనూ ప్రయాణికుల నుంచి యూజర్ ఛార్జీలను వసూలు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశంలో ఎంపిక చేసిన స్టేషన్లలో అత్యాధునిక సేవలకు నామమాత్రంగా వసూలు చేయనున్నారు.
రైల్వే
ఈ విషయాన్ని రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ వెల్లడించారు. దేశంలోని పది నుంచి 15 శాతం స్టేషన్లకే ఈ యూజర్ ఛార్జీలు వర్తిస్తాయని తెలిపారు.
ఇదీ చూడండి:'109 రూట్లలో 151 ప్రైవేటు రైళ్ల కూత!'