తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దక్షిణేశ్వర్​ మెట్రో రైలు తొలి ట్రయల్​ రన్ విజయవంతం

బంగాల్​ దక్షిణేశ్వర్ కాళీ మాత ఆలయం వరకు నిర్మించిన మెట్రో రైలు మొదటి ట్రయల్ రన్​ను విజయవంతంగా నిర్వహించింది భారతీయ రైల్వే. నోపరా నుంచి దక్షిణేశ్వర్​ వరకు 4 కిలోమీటర్లు మేర ఈ ట్రయల్​ రన్​ చేపట్టారు అధికారులు.

Railways conducts 1st trial run of Metro train up to Dakshineswar
దక్షిణేశ్వర్​ మెట్రో రైలు ట్రయల్​ రన్ విజయవంతం

By

Published : Dec 23, 2020, 7:32 PM IST

దక్షిణేశ్వర్​ మెట్రో రైలు ట్రయల్​ రన్ విజయవంతం

బంగాల్​ నోపరా- దక్షిణేశ్వర్​ మెట్రో రైలు తొలి ట్రయర్ రన్​ను బుధవారం విజయవంతంగా నిర్వహించింది భారతీయ రైల్వే. ఈ మేరకు ట్వీట్​ చేశారు రైల్వే శాఖ మంత్రి పీయూష్​ గోయల్​. ఈ మెట్రో రైలు పూర్తయితే లక్షల మంది రోజువారి ప్రయాణికులకు మేలు జరుగుతుందని వివరించారు. అంతేకాక దక్షిణేశ్వర్​ కాళీ మాత దేవాలయానికి వచ్చే భక్తులు తేలిగ్గా ఆలయానికి చేరుకోవచ్చని వెల్లడించారు.

నోపరా నుంచి కవి సుభాశ్ స్టేషన్​ వరకు నిర్మిస్తున్న రైల్వే మార్గం మొత్తం 27.22 కిలోమీటర్లు ఉండగా.. అందులో 15.70 కిలోమీటర్లు భూగర్భం మార్గం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ రైల్వే మార్గంలో మొత్తం 9 స్టేషన్లు ఉన్నాయని పేర్కొన్నారు.

ఇదీ చదవండి :టీఎంసీ- భాజపా నేతల ఘర్షణ.. పలువురికి గాయాలు

ABOUT THE AUTHOR

...view details