దేశంలో రైల్వే జోన్లు, డివిజన్ల సంఖ్య తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వాటి పునర్విభజన, హేతుబద్ధీకరణ అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రైల్వే పరిపాలన వ్యవస్థలో సంస్కరణలు, భారీ రైల్వే ప్రాజెక్టుల కోసం వనరుల సమీకరణ, రైల్వే బోర్డు పునర్విభజన కోసం 2014లో బిబేక్ డెబ్రాయ్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. 32 సిఫార్సులతో 2015లో ఆ కమిటీ నివేదిక సమర్పించిందన్నారు. వాటిలో కొన్నింటిని ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చామని, మరికొన్నింటిపై కసరత్తులు జరుపుతున్నామని వెల్లడించారు.
రైల్వే జోన్లు, డివిజన్ల తగ్గింపు! - Railway zones news updates
భారత్లో రైల్వేజోన్లు, డివిజన్ల సంఖ్యను తగ్గించే అంశం తమ పరిశీలనలో ఉందని రైల్వేమంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ మేరకు లోక్‌సభలో లిఖితపూర్వకంగా ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమధానం ఇచ్చారు.
విద్యార్థులు, క్రీడాకారులకు ఇస్తున్న టికెట్ రాయితీ సొమ్మును ఆయా మంత్రిత్వ శాఖల నుంచి రాబట్టుకోవాలని కమిటీ సిఫార్సు చేసిందని గోయల్ చెప్పారు. ఆ అంశమూ తమ పరిశీలనలో ఉందన్నారు. 24 కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టి ప్రయాణికుల సంఖ్యను పెంచుకోవడం, 16 కోచ్‌ల సామర్థ్యమున్న ఈఎంయూ లేదా డీఎంయూ రైళ్లను తీసుకురావడం, సరకు రవాణా వ్యాగన్ల ఆకృతిని మెరుగుపర్చడం, రైళ్ల భద్రత మినహా ఇతర నిర్వహణ బాధ్యతలను పొరుగు సేవలకు అప్పగించడం వంటి అంశాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: చీఫ్ జస్టిస్, గవర్నర్ అంగీకారం తప్పనిసరి