తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పౌర' సెగ​: బంగాల్​లో రైల్వే స్టేషన్​కు నిప్పు

బంగాల్​లోని ముర్షీదాబాద్​ జిల్లాలో నిరసనకారులు రెచ్చిపోయారు. పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా బెల్దంగ రైల్వే స్టేషన్​కు నిప్పంటించారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆర్​పీఎఫ్​ సిబ్బందిపై దాడి చేశారు.

railway-station-in-bengals-murshidabad-set-on-fire-by-people-protesting-amended-citizenship-act
'పౌర' సెగ​: బంగాల్​లో రైల్వే స్టేషన్​కు నిప్పు

By

Published : Dec 13, 2019, 5:42 PM IST

Updated : Dec 13, 2019, 5:55 PM IST

'పౌర' సెగ​: బంగాల్​లో రైల్వే స్టేషన్​కు నిప్పు

బంగాల్​లో పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసనలు తారస్థాయికి చేరాయి. తాజాగా ముర్షీదాబాద్​ జిల్లాలోని బెల్దంగ రైల్వే స్టేషన్​ కాంప్లెక్స్​కు నిప్పంటించారు వేలాది మంది నిరసనకారులు. కర్రలు పట్టుకుని రైళ్లకు ఎదురుగా వెళ్లారు. అనంతరం కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడే ఉన్న ఆర్​పీఎఫ్​ సిబ్బందిపై దాడికి దిగారు.

"నిరసనకారులు ఒక్కసారిగా స్టేషన్​లోకి ప్రవేశించి.. ప్లాట్​ఫామ్​, 2-3 భవనాలు, రైల్వే కార్యాలయానికి నిప్పంటించారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఆర్​పీఎఫ్​ సిబ్బందిని దారుణంగా కొట్టారు."
- ఆర్​పీఎఫ్​ సీనియర్​ అధికారి.

ఆందోళనల వల్ల రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. బంగ్లాదేశ్​ సరిహద్దులో ఉండే ముర్షీదాబాద్​ జిల్లాలో ముస్లింల జనాభా అధికం.

ఇదీ చూడండి:- 'పౌర' సెగ: కోల్​కతాలో జాతీయ రహదారి దిగ్బంధం

Last Updated : Dec 13, 2019, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details