తెలంగాణ

telangana

ETV Bharat / bharat

200 ప్రత్యేక సర్వీసులతో రైళ్లు ప్రారంభం! - railways started after corona lockdown

సాధారణ ప్రయాణికుల కోసం 200 ప్రత్యేక రైలు సర్వీసులను సోమవారం నుంచి ప్రారంభిస్తోంది రైల్వేశాఖ. తొలిరోజు 1,45,000 మంది ప్రయాణించనున్నట్లు సమాచారం. రైలు బయలుదేరే సమయానికి 90 నిమిషాల ముందే స్టేషన్​కు చేరుకోవాలని ప్రయాణికులకు సూచించారు అధికారులు. కరోనా లక్షణాలు లేనివారినే ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పారు.

railways
2వందల ప్రత్యేక సర్వీసులతో రైల్వే ప్రారంభం!

By

Published : Jun 1, 2020, 9:15 AM IST

దేశవ్యాప్తంగా సోమవారం నుంచి రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే వలస కూలీల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతున్న రైల్వేశాఖ.. సాధారణ ప్రయాణికుల కోసం 200 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తొలిరోజు లక్షా 45 వేల మంది ప్రత్యేక రైళ్లలో ప్రయాణించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఈనెలాఖరు వరకు 26లక్షల మంది టికెట్లు బుక్ చేసుకున్నట్లు పేర్కొంది. వలస కూలీలను తరలించేందుకు నడుపుతున్న శ్రామిక్ రైళ్లకు ఈ సర్వీసులు అదనమని రైల్వే అధికారులు చెప్పారు.

నిబంధనలు ఇవే!

రైలు బయలుదేరే సమయానికి 90నిమిషాల ముందే ప్రయాణికులు స్టేషన్‌కు చేరుకోవాలని సూచించారు అధికారులు. టికెట్‌ కన్‌ఫర్మ్ అయినవారు, రిజర్వేషన్ జాబితాలో ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు. స్టేషన్‌లోకి ప్రవేశించే ముందే కరోనా పరీక్షలు నిర్వహిస్తామని, వైరస్‌ లక్షణాలు లేనివారిని మాత్రమే రైలు ప్రయాణానికి అనుమతిస్తామని చెప్పారు.

ఇదీ చూడండి:మిడతలపై ముప్పేటదాడికి సిద్ధమవుతున్న ప్రభుత్వాలు

ABOUT THE AUTHOR

...view details