కరోనా బాధితులకు వైద్య సహాయం కోసం రైలు బోగీలను వినియోగించేందుకు సిద్ధమవుతోంది రైల్వే శాఖ. చికిత్స అందించేందుకు అనుగుణంగా బోగీలను సిద్ధం చేస్తోంది.
ఆపరేషన్ కరోనా: రైళ్లలో ఐసొలేషన్ వార్డులు సిద్ధం!
కరోనా వైరస్ బాధితుల కోసం రైళ్లను సిద్ధం చేస్తోంది రైల్వే శాఖ. బాధితులను నిర్బంధంలో ఉంచేందుకు అవసరమైన మేరకు రైళ్లలో మార్పులు చేస్తోంది. రైల్వే శాఖ ఏర్పాటు చేయబోయే ఐసొలేషన్ వార్డులోని ప్రత్యేకతలు మీకోసం...
త్వరలో అందుబాటులోకి కరోనా రైలు వార్డులు
కొవిడ్-19 బాధితులు ఉండేందుకు వీలుగా త్రీటైర్ కోచ్‌లో మధ్యనుండే పడకలను తొలగిస్తోంది. రోగిని నిర్బంధంలో ఉంచేందుకు కావాలసిన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఐసొలేషన్ కోచ్‌లో ఈ ప్రత్యేకతలు ఉండనున్నాయి.
- ప్రతి కోచ్ లో రెండు మరుగుదొడ్లను స్నానాల గదులుగా మార్పు.
- బాత్రూంల్లో ఫ్లోటింగ్ టాయిలెట్ పెన్ ఏర్పాటు.
- హ్యాండ్ షవర్, ఒక బకెట్ ను ప్రతి బాత్రూంలో ఉంచుతున్న రైల్వే.
- బోగి పక్కన, మధ్య ఉండే పడకలను తొలగించి ఒక్కో కూపేలో ఇద్దరి నుంచి నలుగురి వరకు ఉండేలా ఏర్పాటు.
- ఐసొలేషన్‌కు వచ్చే వారి సామగ్రి పెట్టుకునేందుకు ప్రత్యేక అల్మారాలు ఏర్పాటు.
- వైద్య పరికరాలను నడపడానికి కంపార్ట్మెంట్లో 220- వోల్ట్ విద్యుత్ అనుసంధానం చేసిన రైల్వే.
- ప్రతి కోచ్‌లో 10 ఐసొలేషన్ వార్డుల ఏర్పాటు, ప్రతి కూపేకు ప్రత్యేకంగా కర్టెన్లు.
- రోగుల కోసం 415 ఓల్ట్స్ విద్యుత్ సరఫరా చేయడానికి ఏర్పాటు.
- ఐసొలేషన్ కోసం తయారు చేసిన కోచ్‌లను నిత్యం శానిటైజ్ చేస్తున్న రైల్వే.
- ఐసొలేషన్ వార్డును ఉపయోగించే ముందు, తరువాత కూడా పూర్తి స్థాయిలో శానిటైజ్ చేసేందుకు ఏర్పాట్లు.
ఇదీ చూడండి:కరోనా సోకిన 'జర్నలిస్ట్'పై కేసు నమోదు