తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెరిగిన రైల్వే ఛార్జీలు.. ఈ అర్ధరాత్రి నుంచి అమలు - railaway charges

train
స్వల్పంగా పెరిగిన రైల్వే ఛార్జీలు

By

Published : Dec 31, 2019, 7:24 PM IST

Updated : Dec 31, 2019, 8:46 PM IST

20:42 December 31

రైల్వే ఛార్జీలు స్వల్పంగా పెరిగాయి. ఆర్డినరీ సెకండ్‌ క్లాస్‌, స్లీపర్‌ క్లాస్‌కు కిలోమీటర్‌కు ఒక పైసా చొప్పున పెంచాలని రైల్వేశాఖ నిర్ణయించింది. మెయిల్‌ సెకండ్‌క్లాస్‌, స్లీపర్‌క్లాస్‌, ఫస్ట్‌క్లాస్‌కు కిలోమీటర్‌కు 2 పైసల చొప్పున పెంచారు. ఏసీ ఛైర్‌ కార్‌, ఏసీ 3, 2 టైర్‌, ఏసీ ఫస్ట్‌క్లాస్‌కు కి.మీ.కు 4 పైసలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెంచిన ఛార్జీలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సబర్బన్‌ రైళ్లలో మాత్రం చార్జీల పెంపు లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014లో చివరి సారిగా రైల్వే ఛార్జీలను పెంచారు. అప్పట్లో ప్రయాణికుల ఛార్జీలు 14.2 శాతం, సరకు రవాణా ఛార్జీలు 6.5 శాతం పెరిగాయి.

19:06 December 31

స్వల్పంగా పెరిగిన రైల్వే ఛార్జీలు.. రేపటినుంచి అమలు

స్వల్పంగా ఛార్జీలు పెంచిన రైల్వే. కిలోమీటరుకు 1 పైసా పెంచుతూ ఉత్తర్వులు. నాన్​ ఏసీ ఎక్స్​ప్రెస్​లలో కిలోమీటరుకు 2 పైసలు, ఏసీ ఎక్స్​ప్రెస్​లలో కిలోమీటరకు 4 పైసలు పెంపు.    సబర్బన్ రైళ్లలో పెంపుదల లేదన్న రైల్వే శాఖ. పెంచిన ఛార్జీలు అర్ధరాత్రి నుంచి అమలు.

Last Updated : Dec 31, 2019, 8:46 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details