కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా నిలిపేసిన రైలు సర్వీసులను క్రమంగా పునరుద్ధిరిస్తోంది రైల్వేశాఖ. ఇందులో భాగంగా జూన్ 1 నుంచి నుంచి కొన్ని రూట్లలో రైళ్లను నడపనుంది. వివిధ రూట్లలో నడిపే 200 రైళ్లకు (100 జతలు) సంబధించిన జాబితాను మంగళవారం విడుదల చేసింది. వీటిలో దురంతో, జనశతాబ్ది రైళ్లకు అవకాశం కల్పించింది. ఈరోజు(మే 21) ఉదయం 10 గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ఇవన్నీ ప్రత్యేక రైళ్లుగానే పరిగణించనున్నారు.
30 రోజుల వరకే...
ఏసీ, నాన్ ఏసీ, జనరల్ క్లాస్ బెర్తులు ఉంటాయి. జనరల్ కేటగిరీలో ఉన్న సీట్లకు కూడా రిజర్వేషన్ ఉన్నవారికే అనుమతించనున్నారు. ఆన్‌లైన్‌లో మాత్రమే టికెట్లు అందుబాటులో ఉంటాయని, బుకింగ్ కౌంటర్స్ తెరచుకోవని స్పష్టం చేసింది. కేవలం రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులనే స్టేషన్‌లోకి అనుమతిస్తారు. 30 రోజుల వరకు అడ్వాన్స్ బుకింగ్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ప్రయాణికుల నుంచి రెండో తరగతి ఛార్జీలను వసూలు చేయనున్నారు. ఈ జాబితాలో సికింద్రాబాద్-నిజాముద్దీన్ (02285) దురంతో ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-విశాఖపట్నం గోదావరి ఎక్స్‌ప్రెస్ (02727 ), ముంబై- భువనేశ్వర్ కోణార్క్(01019), గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ(07201)ఎక్స్‌ప్రెస్ సర్వీసులు ఉన్నాయి.
కర్ణాటకలో అంతర్గత సర్వీసులు..