తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కరోనా' కుమారుడ్ని దాచిన తల్లిపై సస్పెన్షన్ వేటు

కరోనా వచ్చిందని అనుమానం వచ్చినా సమాచారం ఇవ్వాలని పదేపదే చెబుతున్నారు అధికారులు. కానీ ఓ మహిళ మాత్రం వైరస్​ సోకిందని తెలిసినా రహస్యంగా ఉంచారు. రోగిని రైల్వే గెస్ట్​హౌస్​లో దాచారు. చివరకు ఉద్యోగానికే ఎసరు తెచ్చుకున్నారు.

Rail official in Bengaluru who hid her COVID-19 positive son in guest house suspended
'కరోనా' కుమారుడ్ని దాచిన తల్లిపై సస్పెన్షన్ వేటు

By

Published : Mar 20, 2020, 12:42 PM IST

కరోనా వైరస్​ సోకిన కుమారుడ్ని దాచిపెట్టిన ఓ మహిళా అధికారిని సస్పెండ్​ చేసింది రైల్వే శాఖ. కుటుంబంలో ఒకరికి కరోనా సోకిందని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా, ఇతరుల ఆరోగ్యాన్ని ప్రమాదంలో నెట్టినందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు నైరుతి రైల్వే విభాగం అధికారులు.

ఇదీ జరిగింది..

జర్మనీ నుంచి స్పెయిన్​ మీదుగా భారత్​కు వచ్చాడు 25 ఏళ్ల యువకుడు. ఈనెల 13న బెంగళూరు విమానాశ్రయంలో దిగిన వెంటనే అతడ్ని స్వీయ నిర్బంధంలోకి వెళ్లాలని సూచించారు అధికారులు. రక్త నమూనాలు పరీక్షించి... అతడికి కరోనా సోకిందని ఈనెల 18న నిర్ధరించారు.

ఆ యువకుడి తల్లి రైల్వే ఉద్యోగి. కుమారుడు విదేశాల నుంచి వచ్చాడని, కరోనా సోకిందని ఆమె ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వలేదు. బెంగళూరు ప్రధాన రైల్వే స్టేషన్​ సమీపంలోని రైల్వే గెస్ట్ హౌస్​లో అతడ్ని దాచిపెట్టారు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు ఆమెపై వేటు వేశారు.

ఇదీ చదవండి:కరోనా నుంచి కోలుకుని... గుండెపోటుతో మృతి

ABOUT THE AUTHOR

...view details