దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో రైల్వేకు చెందిన మ్యూజియంలు, హెరిటెజ్ గ్యాలరీలు, హెరిటేజ్ పార్కులను తాత్కాలికంగా మూసివేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఈ నిషేధం ఏప్రిల్ 15 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ఏప్రిల్ 15 వరకు రైల్వే మ్యూజియంలు బంద్
రైల్వేకు చెందిన మ్యూజియంలు, హెరిటెజ్ గ్యాలరీలు, పార్క్‌లు ఏప్రిల్ 15 వరకు మూసి వేయాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ప్రాణాంతక కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.
ఏప్రిల్15 వరకు రైల్వే మ్యూజియంలు బంద్
"దిల్లీలోని జాతీయ రైల్వే మ్యూజియం, ప్రాంతీయ రైల్వే మ్యూజియంలు, హెరిటేజ్ పార్కులు, గ్యాలరీలకు పెద్ద సంఖ్యలో చిన్నారులు, వృద్ధులు వచ్చే అవకాశం ఉంది. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా 2020 ఏప్రిల్ 15 వరకు వాటిని మూసివేయాలని నిర్ణయించాం."
-రైల్వే శాఖ