తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రైల్వే టికెట్ ధరలు పెంపు... ఎందుకు? ఎంత? - rajadhani express latest news

రాజధాని, శతాబ్ది, దురంతో ఎక్స్​ప్రెస్ రైళ్లలో ఆహార పదార్ధాల ధరలను పెంచాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఫలితంగా ప్రయాణికులపై రవాణా ఛార్జీలు స్వల్పంగా పెరగనున్నాయి.

ధరలు పెంచిన రైల్వే బోర్డు... పెరగనున్న ఛార్జీలు.

By

Published : Nov 15, 2019, 3:38 PM IST

Updated : Nov 15, 2019, 5:46 PM IST

పలు ఎక్స్​ప్రెస్ రైళ్లలో టికెట్ ధరలు పెరగనున్నాయి. రాజధాని, శతాబ్ది, దురంతో రైళ్లలో ఆహార పదార్థాల ధరలను రైల్వే బోర్డు పెంచడమే ఇందుకు కారణం.

రైల్వే బోర్డు నూతన ఆదేశాల మేరకు పెరిగిన ఆహార ధరలు

  • ఫస్ట్​ క్లాస్ ఏసీలో రూ.29గా ఉన్న టీ ధర ఇప్పుడు రూ.35కు పెరిగింది.
  • అల్పాహార ధర రూ.133 నుంచి రూ.140కి చేరింది.
  • రూ. 230గా ఉన్న భోజనం ధర రూ. 15 పెంచి రూ.245గా నిర్ణయించారు.

ఫస్ట్ క్లాస్ ఏసీ, థర్డ్ క్లాస్ ఏసీలలో రూ.15గా ఉన్న టీ ధర రూ.20కి పెరిగింది. అల్పాహారం రూ.8 పెరిగి 105గా ఉండనుంది. ఈ క్లాస్​లలో భోజనం ధర రూ. 175 నుంచి 185కు చేరింది.

ఇక నుంచి వివిధ ప్రాంతాల్లో లభించే ప్రాంతీయ చిరుతిళ్లను రైళ్లలో కూడా అందుబాటులో ఉంచనున్నట్లు రైల్వే బోర్డు తెలిపింది.

15 రోజుల్లో...

పెంచిన ధరలు 15 రోజుల్లోగా అమలవుతాయని తెలిపింది రైల్వేశాఖ. మిగిలిన రైళ్లలోనూ ఆహార ధరల రేట్లను జనవరి 15 నుంచి పెంచనున్నట్లు తెలిపింది.

ఇదీ చూడండి: చిదంబరానికి నిరాశ- ఐఎన్​ఎక్స్​ కేసులో బెయిల్​ నిరాకరణ

Last Updated : Nov 15, 2019, 5:46 PM IST

ABOUT THE AUTHOR

...view details