మహారాష్ట్ర రాయ్‌గఢ్ జిల్లా మహద్ ప్రాంతంలో ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 16కు పెరిగింది. వీరిలో 9 మంది మహిళలు ఉన్నారు.
సోమవారం సాయంత్రం భవనం కూలిన వెంటనే సహాయక చర్యలు చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది ఇప్పటివరకు 16 మంది మృతదేహాలను వెలికి తీశారు. శిథిలాల కింది నుంచి.. ఓ నాలుగేళ్ల బాలుడు సహా మొత్తం 61 మందిని రక్షించినట్లు మహారాష్ట్ర అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగినపుడు 90 మంది వరకు శిథిలాల కింద చిక్కుకున్నారనే అనుమానంతో ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయ చర్యలు చేపట్టాయి.