మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లో ఐదంతస్తుల భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య 16కు చేరింది. భవన శిథిలాల కింది నుంచి చాలా మందిని కాపాడారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది. వీరిలో ఓ నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బిల్డర్ ఫారూక్ కాజీ, ఆర్కిటెక్ట్ గౌరవ్ షాపై 304, 304ఏ, 338 కింద అభియోగాలు మోపారు.