తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'రాహుల్​ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని మీరలేదు' - కాంగ్రెస్​ అధ్యక్షుడు

స్టెల్లా మేరీస్​ మహిళా కళాశాలలో రాహుల్​గాంధీ నిర్వహించిన ముఖాముఖి, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమేమీ కాదని అధికారులు ప్రకటించారు. ఈ సమావేశానికి పూర్తి అనుమతులన్నాయని తమిళనాడు ముఖ్య ఎన్నికల అధికారి సత్యబ్రత సాహూ తెలిపారు.

రాహుల్

By

Published : Mar 21, 2019, 11:44 PM IST

Updated : Mar 22, 2019, 7:00 AM IST

చెన్నైలోని స్టెల్లా మేరీస్​ మహిళా కళాశాలలో కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​గాంధీ నిర్వహించిన ముఖాముఖిపై అన్నాడీఎంకే ప్రభుత్వం విమర్శలు చేసింది. రాహుల్ సమావేశంపై ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించింది. ఈ అంశంలో రాహుల్​ నియమావళిని ఉల్లంఘించలేదని తమిళనాడు ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసింది.

విద్యార్థులతో రాహుల్​ సమావేశం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమేమీ కాదని తెలిపింది. స్థానిక ఎన్నికల అధికారి సమాచారం మేరకు ఈ సమావేశానికి అనుమతులన్నాయని స్పష్టం చేసింది.

అయినప్పటికీ విద్యార్థులతో కాంగ్రెస్​ అధ్యక్షుడి సంభాషణపై ఒక నివేదికను తయారు చేయాలని చెన్నై ఎన్నికల అధికారిని ఆదేశించినట్లు తమిళనాడు ముఖ్య ఎన్నికల అధికారి సత్యబ్రత సాహూ తెలిపారు.

"మార్చి 13న స్టెల్లా మేరీస్​ మహిళా కళాశాల విద్యార్థులతో రాహుల్​ నిర్వహించిన ముఖాముఖి ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమేమి కాదు. ఆ సమావేశానికి పూర్తి అనుమతులున్నాయని స్థానిక ఎన్నికల అధికారి తెలిపారు. రాహుల్​ ఏ తరహా ప్రసంగం చేశారో ఒక నివేదిక తయారు చేయాలని చెన్నై ఎన్నికల అధికారిని కోరాం."- సత్యబ్రత సాహూ, తమిళనాడు ముఖ్య ఎన్నికల అధికారి

దర్యాప్తు చేపట్టిన తమిళనాడు ప్రభుత్వం

మార్చి 13న విద్యార్థులతో జరిగిన రాహుల్​ సమావేశం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని తమిళనాడు ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది.

రాహుల్​ మాట్లాడిన అంశాలివే

విద్యార్థులతో ముఖాముఖిలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, రఫేల్​ ఒప్పందం తదితర అంశాలపై రాహుల్​ మాట్లాడారు.

Last Updated : Mar 22, 2019, 7:00 AM IST

ABOUT THE AUTHOR

...view details