తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల సీఎంలతో రాహుల్​ భేటీ

హస్తం పార్టీ​ ప్రభుత్వంలో ఉన్న రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, పంజాబ్​, ఛత్తీస్​గఢ్​, పుదుచ్చేరి ముఖ్యమంత్రులతో నేడు రాహుల్​గాంధీ సమావేశంకానున్నారు. లోక్​సభ ఎన్నికల్లో పార్టీ వైఫ్యల్యంపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది.

ముఖ్యమంత్రులతో రాహుల్​ భేటీ

By

Published : Jul 1, 2019, 7:33 AM IST

Updated : Jul 1, 2019, 7:59 AM IST

రాహుల్​ భేటీ

కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నేడు దిల్లీలో రాహుల్​గాంధీ భేటీకానున్నారు. మే నెలలో పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్​ రాజీనామా సమర్పించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం కాంగ్రెస్​లో రాహుల్​గాంధీ పాత్రపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

రాజస్థాన్​, మధ్యప్రదేశ్​, పంజాబ్​, ఛత్తీస్​గఢ్​, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు అశోఖ్​ గహ్లోత్​, కమల్​నాథ్​, అమరేందర్​ సింగ్, భుపేష్​ బఘేల్​ సోమవారం మధ్యాహ్నం జరగనున్న సమావేశానికి హాజరుకానున్నారు.​ ఇటీవలే ముగిసిన లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ ప్రదర్శనపై ఈ భేటీలో చర్చించే అవకాశముంది. కాంగ్రెస్​ అధ్యక్ష పదవిలో రాహుల్​ కొనసాగాలని ముఖ్యమంత్రులు కోరనున్నారు. అయితే నిర్ణయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇప్పటికే రాహుల్​ పట్టు పట్టారు.

పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగడానికి నిర్ణయించుకున్నట్టు మే 25న జరిగిన కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటి సమావేశంలో రాహుల్​ ప్రకటించారు. ఈ సమావేశంలోనే కమల్​నాథ్​, గహ్లోత్​లపై పరోక్ష విమర్శలు చేశారు రాహుల్​.

ఇదీ చూడండి: స్విస్​ ఖాతాల్లో తగ్గిన భారత సొమ్ము

Last Updated : Jul 1, 2019, 7:59 AM IST

ABOUT THE AUTHOR

...view details