తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్​కు మరోసారి పగ్గాలు! - congress party news

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారని ఆ పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్​ సూచన ప్రాయంగా తెలిపారు. వచ్చ నెలలో ఏఐసీసీ సమావేశం నిర్వహించి రాహుల్​ను ఏకగ్రీవంగా ఎన్నుకునే అవకాశాలున్నాయని మరో కాంగ్రెస్​ నేత చెప్పారు.

rahul, congress, aicc
కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్​కు మరోసారి పగ్గాలు!

By

Published : Dec 7, 2019, 5:34 AM IST

Updated : Dec 7, 2019, 11:44 AM IST

కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్​కు మరోసారి పగ్గాలు!
కాంగ్రెస్‌పార్టీ అధ్యక్ష బాధ్యతల విషయంపై ఆ పార్టీ సీనియర్‌ నేత కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఘోర పరాభవం తర్వాత కాంగ్రెస్‌పార్టీ అధ్యక్ష పదవిని వీడిన రాహుల్‌గాంధీ.. మళ్లీ పార్టీ అత్యున్నత పదవిని చేపట్టనున్నారని కేసీ వేణుగోపాల్‌ సూచన ప్రాయంగా వెల్లడించారు. పార్టీ అధ్యక్ష పగ్గాలు రాహుల్‌ చేపట్టడం ప్రస్తుత పరిస్థితుల్లో అనివార్యమన్నారు. ఇదే విషయమై పార్టీ నేతలు చేస్తున్న విజ్ఞప్తిని రాహుల్​ అంగీకరిస్తారని వ్యాఖ్యానించారు వేణుగోపాల్​. జులైలో పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి రాహుల్‌ తప్పుకోవడం భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయమన్నారు. మళ్లీ ఆయన ఆ పదవిని అలంకరిస్తారని చెప్పారు.

వచ్చే నెలలో ఏఐసీసీ సమావేశం నిర్వహించి రాహుల్‌ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోనున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని మరో కాంగ్రెస్​ నేత చెప్పారు. ప్రస్తుతం సోనియా గాంధీ కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.

Last Updated : Dec 7, 2019, 11:44 AM IST

ABOUT THE AUTHOR

...view details