కరోనాను అరికట్టేందుకు అవసరమైన వెంటిలేటర్లు, మాస్క్‌లను విదేశాలకు ఎగుమతి చేయకుండా నిషేధించే నిర్ణయాన్ని తీసుకోవటంలో కేంద్ర ప్రభుత్వం ఆలస్యం చేసిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. మాస్క్‌లు, ఇతర వైద్య పరికరాల ఎగుమతులను నిషేధిస్తూ మార్చి 19న కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో.. మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్.
"ప్రధాన మంత్రి గారు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సూచించినట్లుగా వెంటిలేటర్లు, సర్జికల్ మాస్క్‌లను తగినంత నిల్వ చేయకుండా.. మార్చి 19 వరకు ఇతర దేశాలకు ఎగుమతి చేయటానికి ఎందుకు అనుమతి ఇచ్చారు? అలాంటి చర్యలను ఎందుకు ప్రోత్సహించారు? అది నేరపూరిత చర్య కాదా?"