దేశంలో కరోనా కారణంగా గడచిన 4 నెలల వ్యవధిలో 2 కోట్ల మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. నానాటికీ పెరిగిపోతున్న నిరుద్యోగాన్ని, ఆర్థిక వ్యవస్థ విధ్వంసాన్ని ఎంతోకాలం ప్రజలకు తెలియకుండా దాచలేరని రాహుల్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఓ కథనాన్ని జోడించి... పరోక్షంగా మోదీ సర్కార్‌ను ఉద్దేశించి హిందీలో ట్వీట్ చేశారు రాహుల్.
"ఇప్పటివరకు ఉద్యోగాలు కోల్పోయిన 2 కోట్ల మందికి చెందిన కుటుంబాలు తీవ్రమైన సమస్యల్లోకి జారుకున్న విషయాన్ని తప్పుడు వార్తా కథనాలతో, ఫేస్‌బుక్‌లో విద్వేష పోస్టులతో మరుగునపడేయలేరు."