తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ నిర్ణయాల వల్లే కేసుల్లో భారత్​ ముందుంది'

కరోనా మహమ్మారి విషయంలో ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ మరోసారి విమర్శలు చేశారు. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం వల్లనే కేసుల్లో భారత్​ అగ్రగామిగా ఉందని ఎద్దేవా చేశారు.

rahul modi
రాహుల్ గాంధీ

By

Published : Aug 3, 2020, 9:12 PM IST

దేశంలో రికార్డ్​ స్థాయిలో కరోనా కేసుల సంఖ్య పెరగడంపై ప్రధాని నరేంద్రమోదీని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. వరుసగా ఐదోరోజూ 50 వేలకుపైగా కేసులు నమోదు కావటం పట్ల మోదీ ప్రకటనలను ఉటంకిస్తూ ట్వీట్ చేశారు.

"సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నారు. అందుకే కేసుల విషయంలో మిగతా దేశాలకన్నా భారత్​ ముందుంది."

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

ఈ ట్వీట్​కు ఒక గ్రాఫ్ జత చేశారు రాహుల్. ఇందులో గడిచిన 24 గంటల్లో వివిధ దేశాల్లో నమోదైన కేసుల వివరాలు ఉన్నాయి. ఈ జాబితాలో 52 వేల కేసులతో భారత్ ప్రథమ స్థానంలో ఉంది.

దేశంలో కరోనా విపత్తు నిర్వహణపై కేంద్రంతో పాటు ప్రధాని మోదీపై గత కొన్ని రోజులుగా రాహుల్ విమర్శలు చేస్తున్నారు. అనుకున్న ఫలితాలను ఇవ్వటంలో లాక్​డౌన్​ విఫలమైందని రాహుల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి:కరోనా పంజా: కొత్తగా 52,972 కేసులు, 771 మరణాలు

ABOUT THE AUTHOR

...view details