తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెట్రో ధరలపై మోదీకి రాహుల్​ పంచ్​ - పెట్రోల్​ ధరలు

తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పెట్రో ధరలు జీవితకాల గరిష్ఠ స్థాయిని తాకటంపై మోదీ సర్కార్‌ను విమర్శించారు. ద్రవ్యోల్బణంతో ప్రజలు బాధపడుతుంటే మోదీ సర్కార్ మాత్రం పన్ను వసూళ్లలో బిజీగా ఉందని ఎద్దేవా చేశారు.

Rahul
పెట్రో ధరలపై మోదీకి రాహుల్​ పంచ్​

By

Published : Jan 24, 2021, 11:31 AM IST

పెట్రో ధరల పెంపుపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ మండిపడ్డారు. మోదీ సర్కార్​ను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

"గ్యాస్, డీజిల్, పెట్రోల్​ (జీడీపీ) ధరల పెంపులో మోదీ సర్కార్​ గణనీయమైన అభివృద్ధి సాధించింది. ద్రవ్యోల్బణంతో ప్రజలు బాధపడుతుంటే మోదీ సర్కార్ మాత్రం పన్ను వసూళ్లలో బిజీగా ఉంది"

- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

రాహుల్ ట్వీట్

దిల్లీలో ప్రస్తుతం లీటర్​ పెట్రోల్​ ధర రూ. 85.7గా ఉండగా ముంబయిలో రూ.92.2గా ఉంది.

లీటర్​ డీజిల్​ ధర దిల్లీలో రూ.75.8కి చేరగా ముంబయిలో రూ.82.6కు పెరిగింది.

ABOUT THE AUTHOR

...view details