తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆకలి చావులు పెరుగుతుంటే బియ్యంతో శానిటైజర్లా?' - ఆకలి

బియ్యంతో శానిటైజర్లు తయారు చేసేందుకు అనుమతించిన ప్రభుత్వంపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ ధ్వజమెత్తారు. దేశంలో ఎంతో మంది పేదలు ఆకలితో మరణిస్తుంటే బియ్యాన్ని ఇలా వినియోగించడమేంటని ప్రశ్నించారు.

Rahul slams govt for allowing use of rice to make sanitiser
ఆకలి చావులు పెరుగుతుంటే.. బియ్యంతో శానిటైజర్లా?

By

Published : Apr 21, 2020, 3:01 PM IST

శానిటైజర్లు తయారు చేసేందుకు బియ్యం ఉపయోగించేందుకు అనుమతిచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు కాంగ్రెస్​ నాయకుడు రాహుల్​ గాంధీ.

తిండి లేక దేశంలో ఎంతో మంది మరణిస్తున్నారని, అలాంటి వారి ఆకలి కేకలు పట్టించుకోకుండా ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు రాహుల్.

"దేశంలో పేద ప్రజలు ఎప్పటికి మేల్కొంటారు? ఓ వైపు మీరు ఆకలితో చనిపోతున్నారు. కానీ ప్రభుత్వం మీ ఆకలిని పట్టించుకోకుండా ధనవంతుల చేతులు శుభ్రం చేసేందుకు బియ్యాన్ని ఉపయోగించి శానిటైజర్ల తయారీకి సిద్ధమవుతోంది."

-- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

దేశంలో శానిటైజర్ల తయారీకి మిగులు బియ్యాన్ని వాడటానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఫుడ్​ కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా(ఎఫ్​సీఐ)లో మిగిలే బియ్యంతో ఆల్కహాల్​ ఆధారిత శానిటైజర్లు తయారు చేసేందుకు సోమవారమే అనుమతులు ఇచ్చింది.

ఇదీ చదవండి:కన్నబిడ్డను విడిచి ఒకరు.. కడుపులో బిడ్డతో మరొకరు!

ABOUT THE AUTHOR

...view details