భాజపా ప్రభుత్వం దేశంలో ఎక్కడికి వెళ్లినా ద్వేషాన్ని వ్యాపిస్తుందని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. పౌర నిరసనలతో అట్టుడుకుతున్న అసోంలోని గువహటిలో బహిరంగ సభ నిర్వహించిన రాహుల్... కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం హింసవైపు నడిచే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసోం సహా దేశవ్యాప్తంగా పౌర నిరసనలు జరుగుతున్నాయని.. కానీ ప్రజల గొంతును నొక్కడానికి భాజపా ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. నిరసనకారులపై కాల్పులు జరిపి వారిని చంపడం ఎందుకని ప్రశ్నించారు.
ఎంతో గొప్ప చరిత్ర ఉన్న అసోం రాష్ట్రాన్ని ఆర్ఎస్ఎస్.. తన ప్రధాన కార్యాలయమైన నాగ్‌పుర్ నుంచి నడిపించలేదన్న రాహుల్.. భాజపా పాలనలో రాష్ట్ర ప్రజలకు తగిన గుర్తింపు లభించలేదన్నారు.