రాహుల్ గాంధీయే కాంగ్రెస్‌లో అగ్రనేత అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షిద్ అన్నారు. ఆయన మళ్లీ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోవాలని తమ పార్టీలోని మెజారిటీ వర్గం కోరుకుంటోందని చెప్పారు. అయితే.. రాహుల్‌కు సొంతంగా నిర్ణయాలు తీసుకొనే అవకాశం కల్పించాలని అభిప్రాయపడ్డారు. సోనియా గాంధీ ఉన్నంత వరకూ కాంగ్రెస్‌లో నాయకత్వానికి ఎలాంటి కొరతా ఉండదని ధీమా వ్యక్తం చేశారు. రాహుల్‌పై కాంగ్రెస్ నేతలకు పూర్తి నమ్మకం ఉందన్న ఖుర్షిద్.. నేతలు తమ అభిప్రాయాలను రాహుల్‌పై రుద్దడం సరికాదన్నారు. కాంగ్రెస్‌లో చాలా మంది సీనియర్ నేతలున్నప్పటికీ రాహుల్ గాంధీనే టాప్ లీడర్ అని పేర్కొన్నారు. ఎవరి బలాలు వారికి ఉంటాయి కానీ.. రాహుల్‌ను మించిన నేత కాంగ్రెస్‌లో లేరని స్పష్టం చేశారు.
కాంగ్రెస్‌లో రాహులే నంబర్ వన్: ఖుర్షిద్ - congress president contender news
కాంగ్రెస్‌లో రాహుల్ గాంధీయే టాప్ లీడర్ అని అభిప్రాయం వ్యక్తం చేశారు ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్. రాహుల్ తిరిగి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవాలని పార్టీలోని మెజారిటీ వర్గం కోరుకుంటోందని చెప్పారు.
కాంగ్రెస్‌లో రాహులే నంబర్ వన్: ఖుర్షిద్
కుటుంబ పాలన గురించి ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్‌లో అందరి ఆమోదంతోనే పార్టీ అధినేతగా వాళ్లు కొనసాగుతున్నారన్నారు. కుటుంబ పాలన అనేది సరైన పద్ధతి కాదన్న ఖుర్షిద్.. అలాంటి పాలన లేని పార్టీ ఏదైనా ఉంటే చూపించాలని ప్రశ్నించారు. కేవలం రాజకీయాల్లోనే కాదు అన్ని రంగాల్లోనూ వారసత్వ విధానం ఉందని వ్యాఖ్యానించారు. వాటన్నింటినీ వదిలేసి కేవలం కాంగ్రెస్‌నే విమర్శించడం సరికాదన్నారు.
ఇదీ చూడండి: ఫోన్ మాట్లాడుతూ బావిలో పడిన మహిళ.. తర్వాత ఏమైందంటే?
Last Updated : Mar 2, 2020, 6:17 AM IST