రాజస్థాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని ముగించేందుకు కాంగ్రెస్ నాయకత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. సచిన్ పైలట్‌ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అగ్రనేతలు సహా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
సచిన్ పైలట్‌తో రాహుల్, ప్రియాంక మంతనాలు జరుపుతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌పై తిరుగుబాటు చేయొద్దని కోరినట్లు చెప్పారు. ఆయన ఫిర్యాదులను పార్టీ స్థాయిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే.. వారి చర్చల్లో ఏమి జరిగిందో ఇంకా తెలియరాలేదని పేర్కొన్నారు పార్టీ నేతలు. కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశానికి హాజరుకావాలని పైలట్‌ను కోరినప్పటికీ ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలిపారు.
" ప్రస్తుతం దిల్లీలో ఉన్న సచిన్ పైలట్ ఏ నాయకుడి ఫోన్ కాల్స్ స్వీకరించటం లేదు. సందేశాలకూ స్పందించటం లేదు."
- అవినాశ్ పాండే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి