తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ- షా ద్వయాన్ని రాహుల్, ప్రియాంక ఎదుర్కోగలరు' - దిగ్విజయ్ సింగ్ వార్తలు

కాంగ్రెస్​లో రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ సమర్థమైన నాయకులని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. దర్యాప్తు సంస్థలతో ఇబ్బంది పెట్టినా మోదీ- షా ద్వయాన్ని ఎదుర్కొనే సత్తా వారికి ఉందని తెలిపారు.

MP-RAHUL-PRIYANKA-DIGVIJAY
దిగ్విజయ్ సింగ్

By

Published : Jul 12, 2020, 10:27 AM IST

జాతీయ సమస్యలపై కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దూకుడుగా స్పందిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ అన్నారు. అయితే వీరి ప్రయత్నాన్ని మెచ్చుకోనివారు ఇంకా పార్టీలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు.

దిగ్విజయ్ సింగ్ ట్వీట్లు

"మోదీ- షా ద్వయాన్ని ఎదుర్కొనే సత్తా రాహుల్- ప్రియాంకలకు ఉంది. దర్యాప్తు సంస్థలతో గాంధీ- నెహ్రూ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినా వారికి తట్టుకునే శక్తి ఉంది. జాతీయ సమస్యలపై రాహుల్​, ప్రియాంక దూకుడుగా వ్యవహరించటాన్ని నేను వ్యక్తిగతంగా సమర్థిస్తున్నా. ఈ విషయాన్ని కొంతమంది కాంగ్రెస్ నేతలు అంగీకరించటం లేదు. వాళ్లు ఇంకా కాంగ్రెస్​లో ఎందుకు ఉన్నట్లు?"

- దిగ్విజయ్ సింగ్​

రాహుల్​ను వ్యతిరేకించేవారు లేరు..

2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ ప్రధాన ప్రత్యర్థిగా రాహుల్ దీటుగా నిలబడ్డారని దిగ్విజయ్​ సింగ్ అన్నారు. అదే ఉత్సాహంతో ఏఐసీసీ లేదా పార్లమెంటులో కాంగ్రెస్ సభాపక్ష నేతగా ఉండి పార్టీని ముందుకు నడిపించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. కానీ ఎందుకు స్వచ్ఛందంగా వైదొలిగారో అర్థం కావటం లేదన్నారు.

కాంగ్రెస్​లో రాహుల్​ను వ్యతిరేకించేవారు ఎవరూ లేరని దిగ్విజయ్ స్పష్టం చేశారు. మీడియాలో వస్తోన్న వార్తలు కొంతమంది భావన మాత్రమేనని కొట్టిపారేశారు.

ఇదీ చూడండి:'ఆ విషయంలో మోదీ ఎందుకు భయపడుతున్నారు?'

ABOUT THE AUTHOR

...view details