తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ... ధైర్యముంటే నాతో చర్చకు రండి'

మోదీతో చర్చకు సిద్ధమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి సవాల్ విసిరారు. మోదీ మీడియా ముందు చర్చకు ఎందుకు భయపడుతున్నారని విమర్శనాస్త్రాలు సంధించారు.

మోదీతో చర్చకు సై: మేనిఫెస్టో ప్రకటనలో రాహుల్

By

Published : Apr 2, 2019, 6:11 PM IST

కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ హామీల్లో పస లేదన్న వ్యాఖ్యలపై విమర్శలు చేశారు. అనిల్​ అంబానీకి 30వేల కోట్లు ఇవ్వగలిగినప్పుడు న్యాయ్ పథకాన్ని అమలు ఎందుకు సాధ్యం కాదన్నారు.

ఉపాధి కల్పన, రైతుల సంక్షేమమే లక్ష్యంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు రాహుల్. ప్రస్తుత ఎన్నికల్లో కేరళలోని వయనాడ్​ నుంచి పోటీ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మీతో మేమున్నామని దక్షిణ భారతీయుల్లో స్థైర్యం నింపేందుకే వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నానని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం పట్ల దక్షిణ భారతీయులు సానూకూలంగా లేరన్నారు.

మోదీతో చర్చకు సై: మేనిఫెస్టో ప్రకటనలో రాహుల్

"నరేంద్రమోదీ చర్చకు సుముఖంగా లేరు. మేం మీకు ముందే సవాల్ విసిరాం. ఇప్పుడూ సవాల్ చేస్తున్నా. జాతీయ భద్రతపై చర్చకు రండి. నేను మోదీకి సవాల్ విసురుతున్నాను. విదేశీ విధానంపై నాతో చర్చకు రండి. అవినీతి, అక్రమాలపై చర్చకు రండి. ప్రధాని నాలా ఎందుకు మీడియాతో మాట్లాడటం లేదు? ప్రధాని మీడియాకు ఎందుకు భయపడతున్నారు?పత్రికా సమావేశానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రధానిని మీడియా ఎందుకు ప్రశ్నించటం లేదు? మోదీ దేశ ప్రజల ముందుకు రావటానికి ఎందుకు ముఖం చాటేస్తున్నారు? భయపడేందుకు మోదీకి స్వేచ్ఛ ఉంది. మేం మోదీని ఓడించబోతున్నాం."-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు

ABOUT THE AUTHOR

...view details