బెంగాల్ ప్రజలను మమతా బెనర్జీ హామీలతో మోసగిస్తున్నారని రాహుల్ విమర్శించారు. ఎన్నికల వాగ్దానాలను అమలు చేయకుండా మభ్యపెడుతున్నారని ఆరోపించారు.
దీదీ హామీల అమలులో విఫలమయ్యారు
By
Published : Mar 23, 2019, 5:43 PM IST
దీదీ హామీల అమలులో విఫలమయ్యారు
కొన్ని రోజుల క్రితం వరకూ మహాకూటమి అంటూ 'భాయీబెహన్'లా ఉన్న రాహుల్-మమతాలు ఇప్పుడు పరస్పర విమర్శల పర్వానికి తెరతీశారు. పశ్చిమబంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. దీదీ పాలనలో ప్రజలు కష్టాల్లో జీవిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయటంలో మమత పూర్తిగా విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు, పేదలు, యువతను అందరినీ హామీలతో మోసం చేశారని రాహుల్ విమర్శించారు. ఓ వైపు ప్రధాని మోదీ దేశ ప్రజలను అబద్ధాలతో మోసం చేస్తుంటే... దీదీ బెంగాల్ ప్రజలను హామీలు అమలు చేయకుండా మాటలతో కాలం గడుపుతున్నారని విమర్శించారు.