తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఈ ఏడాది అసత్యవాది'.. రాహుల్​: భాజపా

పౌరసత్వ చట్టం, ఎన్​పీఆర్​లు పేదలపై పన్ను విధించే చర్యలని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకర్​ తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్​ ఈ సంవత్సరపు అసత్యవాదిగా నిలిచారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Rahul 'liar of the year', 'tax' Cong's culture: BJP
'ఈ ఏడాది అసత్యవాది'.. రాహుల్​: భాజపా

By

Published : Dec 27, 2019, 11:13 PM IST

పౌరసత్వ చట్టం, జాతీయ జనాభా పట్టిక (ఎన్​పీఆర్)​లు పేదలపై పన్ను విధించడం లాంటివని కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ చేసిన వ్యాఖ్యలపై.. కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ విరుచుకుపడ్డారు. రాహల్​ 'ఈ సంవత్సరపు అసత్యవాది' అంటూ ఆరోపించారు. ​ ​

పౌరసత్వ చట్టంపై ప్రజలను తప్పుదోవ పట్టించాలని కాంగ్రెస్​ చూస్తోందని జావడేకర్​ అన్నారు. అయినప్పటికీ ఈ విషయంలో ప్రజలంతా ప్రభుత్వానికి అండగా ఉన్నారన్నారు. సంక్షేమ పథకాల లబ్ధిదారులను గుర్తించడమే ఎన్​పీఆర్​ ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. పన్ను వసూలు చేయడం కాంగ్రెస్​ పార్టీ సంస్కృతి అంటూ ఎద్దేవా చేశారు.

రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎప్పడు నోరు విప్పినా అసత్యాలే చెప్పారు. రాహుల్​ వ్యాఖ్యలు అతని కుటుంబానికి ఇబ్బంది కలిగించేలా ఉండేవి. ఇప్పుడు అవే అబద్దాలు తన పార్టీని, దేశ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి.

ప్రకాశ్​ జావడేకర్​, కేంద్రమంత్రి

సమాధానాలు లేకే...

రాహుల్ గాంధీపై చేసిన విమర్శలకు కాంగ్రెస్​ ప్రతిదాడికి దిగింది. ఆర్థిక సమస్యలు, మహిళా భద్రతపై రాహుల్​ కఠినమైన ప్రశ్నలు వేస్తే.. సమాధానాలు చెప్పలేక అధికార పార్టీ వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని కాంగ్రెస్​ అధికార ప్రతినిధి పవన్ ఖేరా వ్యాఖ్యానించారు.

ప్రతి సమస్యపైనా రాహుల్​ గాంధీ కఠినమైన ప్రశ్నలు అడుగుతారు. ప్రజలు సమాధానాలు కోరుకునే ఈ ప్రశ్నలపై స్పందించడానికి ప్రభుత్వం అహంకారం చూపిస్తోంది. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వారి దగ్గర జవాబులు లేవు.

పవన్​ ఖేరా, కాంగ్రెస్​ అధికార ప్రతినిధి

ఎన్​ఆర్​సీపై పార్లమెంటులో ఒకటి చెప్తే, రామ్​లీలా మైదానంలో మరొకటి చెప్తారంటూ అమిత్​ షా, మోదీలపై పవన్​ ఖేరా విమర్శలు గుప్పించారు.

ఇదీ చూడండి : నిందితులకు న్యాయ సహాయం చేయొద్దు: కేంద్రమంత్రి

ABOUT THE AUTHOR

...view details