నేటికీ మహిళలను చులకన భావంతో, అగౌరవంగా చూసే సంస్కృతి దేశంలో కొనసాగుతోందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఓ మహిళను ముగ్గురు వ్యక్తులు కొడుతున్న ఓ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసిన రాహుల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
"ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు. ఇలాంటి ఘటనలను దేశంలోని మహిళలు ఎక్కడో ఒక్కచోట ఎదుర్కొంటూనే ఉన్నారు. మహిళలపై హింస పలు రకాలుగా జరుగుతోంది. ఒక పక్క మహిళలను దేవతలుగా కొలుస్తూనే... అదే సమయంలో వారిని చులకనగా, అగౌరవంగా చూసే సంస్కృతి కొనసాగుతూనే ఉంది."