పార్లమెంట్ వర్షాకాలం సమావేశాలు ప్రారంభానికి కొద్ది క్షణాల ముందు అధికార భాజపాపై మండిపడ్డారు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ. కరోనా వైరస్ కట్టడిలో పూర్తిగా విఫలం కావడం వల్ల ఆ ఫలితం ప్రజలు అనుభవిస్తున్నారని.. మోదీ అహంకారం వల్లే ఇలా జరిగిందని విమర్శించారు. ఆత్మనిర్భర్ అంటే.. మోదీ నెమళ్లతో ఆడుకుంటే.. మీ ప్రాణాలు మీరు కాపాడుకోవటమేనని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వ పనితీరును ఎద్దేవా చేశారు.
" ఈ వారంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 50 లక్షలు దాటనుంది. అదే సమయంలో యాక్టీవ్ కేసులు కూడా 10 లక్షలు మార్కును చేరనున్నాయి. వ్యక్తిగత అహంకారంతో ఓ వ్యూహం లేకుండా లాక్డౌన్ విధించారు. ఫలితంగా కరోనా ఇప్పుడు దేశంలో విజృంభించింది. మోదీ ప్రభుత్వం చెప్పే ఆత్మనిర్భరం అర్థం ఏమిటో తెలుసా.. ప్రధాని మోదీ నెమళ్లతో ఆడుకుంటుంటే మరోపక్క మీ ప్రాణాలు మీరు కాపాడుకోవడం"