కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ నేడు ఉత్తరప్రదేశ్‌లోని అమేఠీలోపర్యటించనున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో భాజపా నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన తరువాత... ఆ నియోజకవర్గంలో రాహుల్ పర్యటించడం ఇదే తొలిసారి.
కాంగ్రెస్ కంచుకోట అయిన అమేఠీలో... తాను ఓడిపోవడానికి గల కారణాలు తెలుసుకోవడానికే రాహుల్ ఈ పర్యటన చేపట్టినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
ఈ పర్యటనలో ఆయన పార్టీ ప్రతినిధులతో భేటీ అవుతారు. అలాగే సలోన్, అమేఠీ, గౌరీగంజ్, జగ్దీశ్పూర్, తలోయ్ అసెంబ్లీ విభాగాల అధ్యక్షులతోనూ సమావేశమవుతారు. పనిలో పనిగా రాహుల్ గాంధీ కొన్ని గ్రామాలనూ సందర్శిస్తారని ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి అనిల్ సింగ్ తెలిపారు.
అలాగే పార్టీ కార్యకర్తలతో రాహుల్‌గాంధీ.... గౌరీగంజ్‌లోని నిర్మలాదేవి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో సమావేశం కానున్నారు.