కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ఇవాళ కేరళలోని తన సొంత నియోజకవర్గమైన వయనాడ్‌లో నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. 'రాజ్యాంగాన్ని రక్షించండి' అనే నినాదంతో ఈ ర్యాలీ నిర్వహించనున్నారు.
జాతీయ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని.. ఎస్కేఎంజే హైస్కూల్ నుంచి కాల్పెట్టలోని కొత్త బస్టాండ్ వరకు సుమారు రెండు కిలోమీటర్ల వరకు ఈ ర్యాలీ కొనసాగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
స్థానిక కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా కేరళ వ్యాప్తంగా సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్నాయి. కాగా నేడు రాహుల్‌గాంధీ స్వయంగా నిరసన ర్యాలీలో పాల్గొననున్నారు.