తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని జనవరి 23న ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడు కేఎస్ అళగిరి వెల్లడించారు. ఈ ఎన్నికల్లోనూ డీఎంకేతో పొత్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కమల్ హాసన్ తమతో చేరాలనుకుంటే స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు.
"జనవరి 23న కోయంబత్తూర్, త్రిస్సూర్ జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచార సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఈరోడ్‌లో జరిగే సభకు హాజరయ్యేందుకు కూడా ఆయన అంగీకరించారు"
-- కేఎస్ అళగిరి, టీఎన్‌సీసీ అధ్యక్షుడు