తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు పట్నా కోర్టు ముందుకు రాహుల్​..

కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ.. నేడు బిహార్​లోని​ పట్నా కోర్టుకు హాజరుకానున్నారు. లోక్​సభ ఎన్నికల సందర్భంగా దాఖలైన పరువునష్టం కేసు విషయమై విచారణ చేయనుంది న్యాయస్థానం. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్ణాటకలో ఏప్రిల్​ 13న 'అందరు మోదీలు.. దొంగలేనని' అర్థం వచ్చేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్​ గాంధీ.

By

Published : Jul 6, 2019, 5:48 AM IST

Updated : Jul 6, 2019, 11:58 AM IST

నేడు పట్నా కోర్టు ముందుకు రాహుల్​..

నేడు పట్నా కోర్టు ముందుకు రాహుల్​..

కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ.. తనపై నమోదైన పరువు నష్టం కేసులతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నెల 4న ముంబయి కోర్టు ముందు హాజరైన ఆయన​.. నేడు మరో కేసు విషయమై పట్నా కోర్టులో విచారణ ఎదుర్కోనున్నారు.

లోక్​సభ ఎన్నికల సందర్భంగా రాహుల్​ చేసిన వ్యాఖ్యలపై పలువురు ఆయా రాష్ట్రాల్లో పరువు నష్టం కేసులు దాఖలు చేశారు.

ఏప్రిల్​ 13న కర్ణాటక కోలార్​లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు.. భాజపా-ఆరెస్సెస్​పై విమర్శలు గుప్పించారు. నీరవ్​ మోదీ, లలిత్​ మోదీ, నరేంద్ర మోదీ పేర్లను ప్రస్తావిస్తూ.. ఇలా అందరు దొంగల పేర్ల వెనుక 'మోదీ' అని కామన్​గా ఎందుకుంటుందని రాహుల్​ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

సుశీల్​ మోదీ ఫిర్యాదు...

రాహుల్​ మాటలపై ఆగ్రహించిన బిహార్​ ఉపముఖ్యమంత్రి, భాజపా నేత సుశీల్​ కుమార్​ మోదీ ఏప్రిల్​ 18న అక్కడి పట్నా కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. రాహుల్​ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు.

సుశీల్​ ఫిర్యాదును పరిశీలించిన న్యాయస్థానం.. విచారణకు హాజరుకావాలని రాహుల్​ గాంధీకి సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్​ నేత శతృఘ్న సిన్హా.. రోడ్​ షో సందర్భంగా రాహుల్​ చివరగా మే నెలలో పట్నా వెళ్లారు.

గుజరాత్​లోని అహ్మదాబాద్, సూరత్​ కోర్టుల్లో నమోదైన పరువునష్టం కేసు విచారణలకూ రాహుల్ రాబోయే రోజుల్లో హాజరుకావాల్సి ఉంది. సంఘ్​ కార్యకర్త, న్యాయవాది జోషి పరువునష్టం కేసు విచారణలో ముంబయి కోర్టు జులై 4న రూ. 15 వేల పూచీకత్తుతో రాహుల్​కు బెయిల్​ మంజూరు చేసింది.

Last Updated : Jul 6, 2019, 11:58 AM IST

ABOUT THE AUTHOR

...view details