తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సుప్రీంకు రాహుల్​ బేషరతు క్షమాపణలు

కోర్టు ధిక్కరణ కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ సర్వోన్నత న్యాయస్థానానికి బేషరతు క్షమాపణ చెప్పారు. ఈ మేరకు కొత్త ప్రమాణపత్రం సమర్పిచారు. ఈ అఫిడవిట్ సహా రఫేల్​ తీర్పు సమీక్షా వ్యాజ్యాలపై ఈనెల 10న విచారణ చేపట్టనుంది సుప్రీంకోర్టు

సుప్రీంకు రాహుల్​ బేషరుతు క్షమాపణలు

By

Published : May 8, 2019, 3:32 PM IST

Updated : May 8, 2019, 4:16 PM IST

సుప్రీంకు రాహుల్​ బేషరుతు క్షమాపణలు

'చౌకీదార్‌ చోర్‌' వ్యాఖ్యలను సుప్రీంకోర్టుకు తప్పుగా ఆపాదించినందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సర్వోన్నత న్యాయస్థానానికి బేషరతు క్షమాపణలు చెప్పారు. తాను ఈ వ్యాఖ్యలను ఉద్దేశపూర్వకంగా చేయలేదని పేర్కొంటూ నేడు మూడు పేజీల అఫిడవిట్‌ దాఖలు చేశారు. ఈ అఫిడవిట్​ సహా రఫేల్​ తీర్పు సమీక్షా వ్యాజ్యాలపై ఈనెల 10న విచారణ జరగనుంది.

"సుప్రీంకోర్టు అత్యున్నత సంస్థ. కోర్టుపై నాకు అపార గౌరవం ఉంది. న్యాయవ్యవస్థ విధానాల్లో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ జోక్యం చేసుకునే ఉద్దేశం నాకు లేదు. ఈ వ్యవహారంలో నాపై నమోదైన నేరపూరిత కోర్టు ధిక్కార కేసును కొట్టేయాలని అభ్యర్థిస్తున్నా."
- రాహుల్​గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు

రఫేల్‌ యుద్ధవిమానాల ఒప్పందంపై గత ఏడాది ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 10న ఉత్తర్వులిచ్చింది. ఈ తీర్పు 'చౌకీదార్‌ చోర్‌' అనే అంశాన్ని స్పష్టం చేస్తుందంటూ రాహుల్‌ వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పుపై రాహుల్‌ తప్పుగా వ్యాఖ్యానించారంటూ భాజపా నేత మీనాక్షి లేఖీ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

కోర్టు సైతం వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించారని అభిప్రాయపడుతూ రాహుల్​కు ఏప్రిల్​ 23న నోటీసులు జారీ చేసింది. రెండు ప్రమాణపత్రాలు సమర్పించిన రాహుల్.... తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తంచేశారు. కోర్టు ధిక్కరణ పిటిషన్​ను కొట్టివేయాలని కోరారు.

సంతృప్తి చెందని సుప్రీం

రాహుల్​ సమర్పించిన ప్రమాణపత్రాలతో సుప్రీంకోర్టు సంతృప్తి చెందలేదు. ఓసారి తప్పు చేశామని, మరోసారి చేయలేదని అంటున్నారని మందలించింది. అసలు మీరు ఏం చెప్పదలిచారో అర్థంకావడంలేదని అసహనం వ్యక్తంచేసింది. సుస్పష్ట వివరణ ఇచ్చేందుకు మరో అవకాశం ఇచ్చింది. అందుకే రాహుల్​ నేడు మరో ప్రమాణపత్రం దాఖలు చేశారు.

Last Updated : May 8, 2019, 4:16 PM IST

ABOUT THE AUTHOR

...view details