తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వ్యవసాయ బిల్లులు.. రైతులకు డెత్​ వారెంట్లు' - కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ

వ్యవసాయ బిల్లులను ఆమోదించటం ద్వారా ప్రభుత్వం రైతులకు డెత్​ వారెంట్లు జారీ చేసిందన్నారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. ప్రభుత్వ విధానాలతో ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందని పేర్కొన్నారు రాహుల్​.

Rahul Gandhi
కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ

By

Published : Sep 20, 2020, 8:03 PM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ రంగ బిల్లులపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ. రెండు వ్యవసాయ బిల్లులను ఆమోదించటం ద్వారా రైతులపై ప్రభుత్వం డెత్​ వారెంట్లు జారీ చేసిందని అభిప్రాయపడ్డారు. మోదీ సర్కార్​ విధానాలతో ప్రజాస్వామ్యం సిగ్గుపడుతోందని ఆరోపించారు.

"రైతులు భూమిలోంచి బంగారాన్ని పండిస్తున్నారు. కానీ, మోదీ ప్రభుత్వం అహంకారంతో రైతుల కన్నీటి నుంచి రక్తం వచ్చేలా చేస్తోంది. రాజ్యసభలో ఆమోదించిన రెండు వ్యవసాయ బిల్లుల రూపంలో.. ప్రభుత్వం రైతులకు డెత్​ వారెంట్లు జారీ చేసింది. ఈ విధానాలతో ప్రజాస్వామ్యం సిగ్గుపడింది."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ నేత

ఈ బిల్లులను వ్యవసాయ వ్యతిరేక చట్టాలుగా పేర్కొన్నారు రాహుల్​ గాంధీ. వ్యవసాయ మార్కెట్లకు ముగింపు పలికి రైతులకు ఏవిధంగా కనీస మద్ధతు ధర(ఎంఎస్​పీ)పై హామీ ఇస్తారని ప్రశ్నించారు. రైతులను పెట్టుబడిదారులకు బానిసలుగా చేసిందని.. మోదీ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు రాహుల్​. దీనిని దేశం ఆమోదించదని పేర్కొన్నారు. 'రైతుల శత్రువు మోదీ' అనే హ్యాష్​ట్యాగ్​తో ట్వీట్​ చేశారు.

ఇదీ చూడండి:గందరగోళం మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం

ABOUT THE AUTHOR

...view details