కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై మరోసారి ధ్వజమెత్తారు. బడ్జెట్లో సైనికుల పింఛను తగ్గింపును తప్పుపట్టారు. ఈ విషయంపై సోమవారం ట్విట్టర్లో స్పందించారు.
"బడ్జెట్లో సైనికుల పింఛను తగ్గించారు. రైతులు, యువత కన్నా మోదీ ప్రభుత్వానికి 3-4 పారిశ్రామిక వేత్తలే దేవుళ్లు"
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
బడ్జెట్ రాహుల్ ఇదివరకు కూడా ఇటువంటి విమర్శలే చేశారు. ప్రసంగంలో మోదీ పేరు 6 సార్లు, కార్పొరేట్ సంస్థల గురించి 17 సార్లు ప్రసావించిన ఆర్థిక మంత్రి.. రక్షణ, చైనా అంశాల గురించి ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని ఆరోపించారు.
ఇదీ చదవండి :'రైతులు ఫోన్ చేస్తేనే చర్చల్లో ముందుకెళ్లగలం'