తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశాన్ని కాపాడే జవాన్లకు ద్రోహం: రాహుల్​ - ప్రధాని నరేంద్ర మోదీపై రాహుల్​ విమర్శలు

భారత్-చైనా సరిహద్దుల్లో ప్రతికూల పరిస్థితుల్లో సేవలందిస్తున్న సైనికుల స్థితిగతులను మెరుగుపరిచేందుకు బడ్జెట్​లో కేటాయింపులేమీ లేవని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు.

Rahul Gandhi slams Centre for 'betraying India's defenders' in Union Budget
బడ్జెట్​లో కేటాయింపులేమీ లేవని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ఆరోపణ

By

Published : Feb 5, 2021, 12:16 PM IST

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్​లో దేశాన్ని కాపాడే జవాన్ల బాగోగులను కేంద్రం పట్టించుకోలేదని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​గాంధీ ఆరోపించారు. అన్ని రంగాలనూ బడ్జెట్‌ పూర్తిగా నిరాశపరిచిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కొందరు వ్యాపారవేత్తల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని రాహుల్​ ధ్వజమెత్తారు.

మోదీ ప్రవేశపెట్టిన పెట్టుబడిదారుల (క్రోనీ సెంట్రిక్)బడ్జెట్​తో జవాన్లకు ఒరిగేదేమీ లేదు. భారత్​ని అనునిత్యం కాపాడే సైనికులకు కేంద్రం ద్రోహం చేసింది. జవాన్ల సంక్షేమానికి నిధుల కేటాయింపు ఆశాజనకంగా లేదు.

-రాహుల్​గాంధీ ట్వీట్

ఆర్థికంగా తీవ్ర నష్టాల్లో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు(ఎంఎస్ఎంఈ) తక్కువ వడ్డీ రుణాల ఊసేలేదని రాహుల్​ మండిపపడ్డారు.

ఇదీ చదవండి:బడ్జెట్​తో 99% మందికి అన్యాయం: రాహుల్​

ABOUT THE AUTHOR

...view details