కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని.. 'సరెండర్ మోదీ' అంటూ చేసిన ఓ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతోంది.
అఖిలపక్ష సమావేశంలో 'చైనా బలగాలు భారత భూభాగంలోకి చొరబడలేదు' అంటూ.. ప్రధాని చేసిన వ్యాఖ్యలపై శనివారం స్పందించారు రాహుల్. 'ప్రధాని మోదీ భారత భూభాగాన్ని చైనాకు అప్పగించేశారు. మరి ఆ భూభాగం చైనాదే అయితే.. భారత సైనికులను ఎక్కడ చంపారు? ఎందుకు చంపారు?' అంటూ ప్రశ్నించారు. ఇక ఆదివారం ప్రధానిపై మరో కౌంటర్ వేశారు. ఆయన పేరును వ్యంగ్యంగా మారుస్తూ... 'నరేంద్రమోదీ కాదు సరెండర్ మోదీ' అంటూ ట్వీట్ చేశారు.
అక్షర దోషం...
'సరెండర్' అంటే ఆంగ్లంలో 'లొంగిపోయిన' అని అర్థం. ఆ పదంలో రెండు ఆంగ్ల 'ఆర్' అక్షరాలుండాలి. కానీ, రాహుల్ మాత్రం ఒకే 'ఆర్' పెట్టి పోస్ట్ చేశారు. ఆ ఒక్క అక్షర దోషంతో.. 'సరెండర్' కాస్తా 'సురేందర్'గా ఉచ్ఛరించాల్సి వస్తోంది. సురేందర్ అంటే దేవతలకు రాజు అని అర్థం. దీంతో మోదీని పొగుడుతున్నారా, తిడుతున్నారా అర్థంకాక కన్ఫ్యూజ్ అయిపోయిన ప్రజలు.. ట్రోలింగ్ మొదలెట్టారు.
రాహుల్ భావమేంటని ప్రశ్నిస్తూ... స్పెల్లింగ్ మార్చుకోవాలని సలహాలిస్తూ వెల్లువెత్తిన కామెంట్లలో కొన్ని ఇవి..
" అంటే మీ ఉద్దేశం సరెండర్ అనే కదా? "