తెలంగాణ

telangana

'ఆపరేషన్​ మహా'తో ప్రజాస్వామ్యం ఖూనీ: రాహుల్

By

Published : Nov 25, 2019, 12:15 PM IST

Updated : Nov 25, 2019, 1:19 PM IST

మహారాష్ట్ర వ్యవహారంలో భాజపాకు వ్యతిరేకంగా పార్లమెంటులో విపక్షాలు నిరసనకు దిగాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. లోక్​సభలో ఆరోపించారు.

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

'ఆపరేషన్​ మహా'తో ప్రజాస్వామ్యం ఖూనీ: రాహుల్

మహారాష్ట్ర వ్యవహారంపై పార్లమెంటు ఉభయ సభల్లో గందరగోళం చెలరేగింది. ప్రారంభమైన కాసేపటికే రెండు సభలూ వాయిదా పడ్డాయి. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని లోక్​సభ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

"అధ్యక్షా.. నేను ఈ రోజు ప్రశ్నించడానికి వచ్చాను. కానీ ఇక్కడ ప్రశ్నించడంలో ఎలాంటి ప్రయోజనం లేదు. మహారాష్ట్రలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. "

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

కాంగ్రెస్ నిరసన

రాహుల్ మాట్లాడిన తర్వాత లోక్​సభలో కాంగ్రెస్ సభ్యులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. మహారాష్ట్రలో భాజపా ప్రభుత్వ ఏర్పాటును వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. సభలో పెద్ద బ్యానర్లను ప్రదర్శించిన కాంగ్రెస్ నేతలు హిబీ ఈదెన్​, టీఎన్​ ప్రతాపన్​ను బయటకు పంపాలని మార్షల్స్​ను ఆదేశించారు స్పీకర్​ ఓం బిర్లా. సభను గంటపాటు వాయిదా వేశారు. అనంతరం 12 గంటలకు తిరిగి ప్రారంభమయినా.. అదే పరిస్థితి కొనసాగింది. ఫలితంగా సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు ఓం బిర్లా.

రాజ్యసభలోనూ..

రాజ్యసభ ప్రారంభం కాగానే విపక్షాలు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశాయి. వాయిదా తీర్మానం కోసం విపక్షాలు ఇచ్చిన నోటీసులను ఛైర్మన్​ వెంకయ్యనాయుడు తిరస్కరించారు. సభ కార్యక్రమాలను విపక్ష సభ్యులు అడ్డుకున్న నేపథ్యంలో మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

ఇదీ చూడండి: 'మహారాష్ట్ర' వ్యవహారంపై తీర్పు రేపటికి వాయిదా

Last Updated : Nov 25, 2019, 1:19 PM IST

ABOUT THE AUTHOR

...view details