కేరళ వయనాడ్‌లోని బ్రహ్మగిరి కొండపై ఉన్న తిరునెల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. సంప్రదాయ దుస్తుల్లో కాలినడకన ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.
'పుల్వామా' అమరుల కోసం రాహుల్ పూజలు - వయనాడ్
కేరళ వయనాడ్‌లోని తిరునెల్లి ఆలయాన్ని దర్శించుకున్నారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, తన పూర్వీకులతో పాటు పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల ఆత్మశాంతి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

తిరునెల్లి ఆలయంలో రాహుల్ గాంధీ పూజలు
తిరునెల్లి ఆలయంలో రాహుల్ గాంధీ పూజలు
హిందూ ఆచారాల ప్రకారం పాపనాశిని నది వద్ద ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, తన పూర్వీకులతో పాటు పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్ల ఆత్మలకు శాంతి చేకూరాలని పూజలు నిర్వహించారు రాహుల్. రాజీవ్‌గాంధీ అస్థికలను అప్పట్లో ఈ నదిలోనే కలిపారు.
అమేఠీతోపాటు వయనాడ్ లోక్‌సభ స్థానానికి రాహుల్ పోటీ చేస్తున్నారు.