పౌరచట్టం, ఎన్ఆర్సీలపై కేంద్రం విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మహాత్మగాంధీని చంపిన నాథూరాం గాడ్సే అనుసరించిన సిద్ధాంతాలనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా అనుసరిస్తున్నారని ఆరోపించారు.
కేరళలోని తన సొంత నియోజకవర్గం వయనాడ్లో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ పేరుతో నిర్వహించిన పాదయాత్రలో పాల్గొన్నారు రాహుల్. అనంతరం ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించారు.
"భారతీయుడు ఎవరనేది నిర్ణయించే అధికారం ప్రధానికి ఎవరిచ్చారు? 130 కోట్లమంది భారతీయులు ఎవరూ నిరూపించుకోనక్కర లేదు. నాథూరాం గాడ్సేలా మోదీ కూడా విద్వేషంతో నిండిపోయారు. నాథూరాం గాడ్సే తనపై తనకు విశ్వాసం లేకే మహాత్మాగాంధీని కాల్చారు. నాథూరాం గాడ్సే ఎవరినీ నమ్మలేదు. గాడ్సే లాగానే మోదీ కూడా ప్రవర్తిస్తున్నారు. మోదీ తనను మాత్రమే ప్రేమిస్తారు. తనను తాను నమ్ముతారు. ఎవ్వరినీ నమ్మరు. భారతీయుల స్పందన వినేందుకు ఇష్టపడరు. నాథూరాం గాడ్సే సిద్ధాంతాలను ఎదుర్కొనేందుకు ఎలా పోరాడామో అదే విధానంతో ప్రధాని అనుసరిస్తున్న విధానాలపై పోరాడతాం. యువతా.. నరేంద్రమోదీ భారత్లో మీకు భవిష్యత్తు మీకు తెలుసు. మీరు ఎంతకాలం చదవాలి అనుకుంటే అంత కాలం చదవండి. కానీ మీకు ఉద్యోగం రాదు. కారణమేమిటో తెలుసా.. దేశంలో మోదీ విద్వేషాన్ని, ఆగ్రహాన్ని వ్యాప్తి చేస్తున్నారు."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
ఇదీ చూడండి: 'నవభారత నిర్మాణంలో బాపూ ఎప్పటికీ ఆదర్శమే'