కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యవహారంలో కేంద్రం తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ, ఈడీ, కొన్ని మీడియా సంస్థలను ఉపయోగించుకుని చిదంబరం వ్యక్తిత్వ హననానికి, ఆయన ప్రతిష్ఠను దిగజార్చేందుకు మోదీ సర్కార్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వ అధికార దుర్వినియోగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు రాహుల్.
'చిదంబరం ప్రతిష్ఠ దిగజార్చేందుకు కేంద్రం కుట్ర' సత్యం కోసం పోరాటం కొనసాగిస్తాం...
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ... చిదంబరానికి బాసటగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ సత్యం కోసం పోరాటాన్ని కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.
'చిదంబరం ప్రతిష్ఠ దిగజార్చేందుకు కేంద్రం కుట్ర' కాంగ్రెస్ అధికార ప్రతినిధులు రణదీప్ సుర్జేవాలా, ఆనందశర్మ కూడా చిదంబరానికి సంఘీభావం తెలిపారు.
రాజకీయ కక్ష సాధింపే..
చిదంబరంపై సీబీఐ, ఈడీ చర్యలు రాజకీయ కక్షసాధింపేనని డీఎంకే అధినేత స్టాలిన్ పేర్కొన్నారు. ఇలాంటి చర్యలను చిదంబరం సమర్థంగా ఎదుర్కోగలరని ధీమా వ్యక్తంచేశారు.
ఇవాళ విచారణ లేనట్లే
చిదంబరం తరఫు న్యాయవాదులు వేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో లోపాలు ఉన్న కారణంగా సుప్రీంకోర్టు రిజిస్ట్రీ విచారణకు అనుమతించలేదు. కోర్టు విచారణ జాబితాలో లేనందున కేసు వాదనలు వినడం కుదరదని జస్టిస్ ఎన్.వి.రమణ స్పష్టం చేశారు. ఫలితంగా చిదంబరం బెయిల్ కొనసాగింపు పిటిషన్ ఇవాళ విచారణకు వచ్చే అవకాశాలు లేనట్లే.
ఇదీ చూడండి: దిల్లీలో రెచ్చిపోయిన దుండగులు... నడిరోడ్డుపైనే చోరీ!