తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అంబానీ, అదానీల మేలు కోసమే సాగు చట్టాలు: రాహుల్​ - అంబానీ, అదానీల మేలు కోసమే ఈ చట్టాలు: రాహుల్​

నూతన సాగు చట్టాలను రద్దు చేసే వరకు తమ పార్టీ వెనక్కి తగ్గబోదని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ అన్నారు. దిల్లీలో నిర్వహించిన రాజ్​భవన్​ ముట్టడి కార్యక్రమంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి ఆయన పాల్గొన్నారు.

farmers protest Rahul Gandhi
అంబానీ, అదానీల మేలు కోసమే ఈ చట్టాలు: రాహుల్​

By

Published : Jan 15, 2021, 3:08 PM IST

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు కాంగ్రెస్‌పార్టీ వెనక్కి తగ్గేదే లేదని ఆ పార్టీ నేత రాహుల్ ‌గాంధీ స్పష్టం చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌పార్టీ దేశవ్యాప్తంగా చేపట్టిన రాజ్‌భవన్‌ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా దిల్లీలో నిర్వహించిన నిరసనలో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో కలిసి రాహుల్ పాల్గొన్నారు.

"ఈ నూతన సాగు చట్టాలు.. రైతులకు ప్రయోజనం కల్గించే బదులు వారిని దెబ్బతీస్తాయి. అంబానీ, అదానీలకు మేలు చేయడం కోసమే ఈ చట్టాలను రూపొందించారు. గతంలో భూసేకరణ చట్టం ద్వారా రైతుల భూములను లాక్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే కాంగ్రెస్‌పార్టీ అడ్డుకుంది."

--రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అగ్రనేత

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం రాహుల్‌, ప్రియాంక దిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల శిబిరాలకు వెళ్లి వారితో ముచ్చటించారు.

ఇదీ చూడండి:వెనక్కి తగ్గని అన్నదాతలు- పట్టువీడని ప్రభుత్వం

ABOUT THE AUTHOR

...view details